నేరేడుచర్ల, వెలుగు : నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు నేరడుచర్లలో పర్యటించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, వైస్ చైర్మన్ సరితాసైదిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు నేరేడుచర్లలోని జాన్ పహాడ్ లో రూ.1.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.