మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం: మంత్రి ఉత్తమ్​

 

సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పర్యటించారు.  హుజూర్​ నగర్​ లో 2వేల 160  డబుల్​ బెడ్​ రూం ఇళ్లను పరిశీలించారు.  మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం అన్న  మంత్రి .... నియోజకర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.    ఐటీఐ కాలేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన తరువాత ఆయన క్యాంప్​ కార్యాలయంలో  కళ్యాణలక్ష్మీ.. షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.  హుజూర్​ నగర్​ లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం పరిశీలనలో ఉందని తెలిపారు. 

2009లో ఆయన గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజవర్గంలో హౌసింగ్​ కాలనీ ఏర్పాటు చేసి 2 వేల 160 ఇళ్ల నిర్మాణ పనులను 70 శాతం పూర్తి చేశామన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వ మిగిలిన వర్క్​ పూర్తి చేస్తామని చెప్పి పేదలను అన్యాయం చేసిందన్నారు.   ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతరువాత రూ. 75 కోట్ల రూపాయిలతో హౌసింగ్​ కాలనీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు.  2025 జనవరి నాటిని ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి పేదలకు ఇస్తామన్నారు.