హుజూర్ నగర్, కోదాడలో నేడు మంత్రి పర్యటన

  •     రూ.126 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో  నేడు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  పర్యటించనున్నారు. రూ.126 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హుజూర్ నగర్​లోని  రామస్వామిగట్టు సమీపంలో రూ.40 కోట్లతో ఐటీఐ కళాశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. చింతలపాలెం మండలంలో  దొండపాడు నుంచి నేషనల్ హైవే వరకు రూ.20 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి, రెండో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​పై  స్థానిక రైతులతో చర్చించనున్నారు.

అనంతరం రూ .20 కోట్లతో హుజూర్ నగర్ – యాతవాకిళ్ల డబుల్ రోడ్డు, రూ.20 కోట్లతో చిల్లేపల్లి– సోమారం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోదాడ నియోజకవర్గంలోని రూ.16 కోట్లతో చిలుకూరు –  జెర్రిపోతులగూడెం రోడ్డు విస్తరణ, రూ.10 కోట్లతో కీతవారి గూడెం – మునగాల రోడ్డు విస్తరణ పనులకు గణపవరంలో మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.