కోదాడ, హుజూర్ నగర్ లో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన 

హుజూర్ నగర్, వెలుగు: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈనెల 3న నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు హుజూర్ నగర్ క్యాంపు ఆఫీస్ పీఆర్వో వెంకట్​రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కోదాడ మున్సిపాలిటీల పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనులు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హుజూర్ నగర్ లో రామస్వామి గుట్ట సమీపంలో నిర్మిస్తున్న  క్రిస్టియన్ శ్మశాన వాటిక పనులు, మినీ స్టేడియం స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు.