మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ

హుజూర్ నగర్, వెలుగు : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్​ముఖ్ ను నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. అరుణ్ కుమార్ మాతృమూర్తి నాగలక్ష్మి ఇటీవల మృతి చెందారు. మంగళవారం బూరుగడ్డలోని అరుణ్​కుమార్ నివాసానికి మంత్రి వెళ్లి నాగలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు ఎలక సైదులు గౌడ్ నివాసానికి మంత్రి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట డీసీఏంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, తన్నీరు మల్లికార్జునరావు ఉన్నారు.