పంట నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్.. నష్టపరిహారంపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

పంట నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్.. నష్టపరిహారంపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

నల్లగొండ: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి  నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి   మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిందని చెప్పారు.  

Also Read:-వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ అలర్ట్

దురదృష్టవశాత్తు కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లోనే అతి భారీ వర్షాలు పడ్డాయని.. వరదల వల్ల కోదాడ ప్రాంతంలో ఇద్దరు చనిపోవడం బాధాకరమని అన్నారు.  సాగర్ లెఫ్ట్ కెనాల్ తెగిపోవడం వల్ల 300 ఎకరాలు నష్టపోయిందన్న ఉత్తమ్..  వారం రోజుల్లో గండి పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ధైర్యం కల్పించారు.