మంత్రి ఉత్తమ్ పర్యటన వాయిదా

మేళ్లచెరువు(చింతలపాలెం), మఠంపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో   ఇరిగేషన్, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సెప్టెంబర్ 6కు వాయిదా పడింది. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కోసం హెలికాప్టర్ ద్వారా 

ఈనెల 30న మంత్రి రావాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన వాయిదా వేసినట్లు మంత్రి కార్యాలయం ప్రకటన ద్వారా వెల్లడించింది. సెప్టెంబర్ 6న మంత్రి పర్యటన యథావిధిగా ఉంటుందని పేర్కొంది.