వరద నష్టం ఎంతో పూర్తి వివరాలివ్వండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మరో నాలుగు రోజులు వర్షాల నేపథ్యంల అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  వరదల పైన జల సౌదాలో  అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తమ్.  రానున్న నాలుగు రోజులు వాతావరణ శాఖ  రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..కొన్ని జిల్లాలకు   గ్రీన్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలోని అధికారులు హై అలర్ట్ గా ఉండాలని ఉత్తమ్ ఆదేశించారు.

ALSO READ | చిట్యాల పంట పొలాల్లో దిగిన ఆర్మీ హెలికాఫ్టర్

 ఎలాంటి సమస్య వచ్చినా దానికి పూర్తి బాధ్యత ఆ జిల్లా అధికారిదేనన్నారు ఉత్తమ్.  ఎప్పుడు  అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. డ్యామేజ్ అయిన  వాటికోసం షార్ట్ టెండర్స్  ని పిలవాలని ఆదేశించారు. ఈరోజు నైట్ వరకు టెండర్స్ కు  వచ్చేలాగా చూడాలన్నారు.  వరదల వల్ల ఎంత నష్టం వచ్చిందో పూర్తి డీటెయిల్స్ కావాలని చెప్పారు. నీటి స్టోరేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఉత్తమ్.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు.