అకాలవర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కూడా MSP కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇది అత్యవసర పరిస్థితిగా భావిస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు తరుగు ఎక్కువ తీస్తున్నారన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. చివరి గింజ వరకు ఎంత నష్టమైనా ప్రభుత్వమే MSPకి కొనుగోలు చేస్తుందన్నారు. తాగునీటి కోసం 2.25 TMCల నీటిని కర్ణాటక నుంచి తెలంగాణకు నారాయణపూర్ జలాశయానికి తీసుకొస్తున్నామన్నారు ఉత్తమ్.
మేడిగడ్డ డ్యామ్ పై ఎన్డీఎస్ఏ రిపోర్టు అడిగామన్నారు ఉత్తమ్.. మధ్యంతర నివేదిక ఇచ్చారని చెప్పారు, 2019 నుంచే డ్యామేజ్ అయిందని చెప్పారు. గత ప్రభుత్వం తప్పిదం ఉందని చెప్పారన్నారు. డ్యామ్ ల భవిష్యత్ గురించి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు ఉత్తమ్. డ్యామ్ ల భవిష్యత్తు గురించి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు. గోదావరి పైనున్న అన్ని డ్యామ్లలో నీటిని తీసేయ్యమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు ఉత్తమ్. వారం పది రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందని చెప్పారు. రైతులకు ఏ విధమైన నష్టమైనా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బీఆర్ఎస్, బిజెపి ల ఒప్పందం స్పష్టంగా కనిపిస్తుందన్న ఉత్తమ్.. బీఆర్ ఎస్ ప్రభుత్వం లో పోలింగ్ బూత్ లో ఉన్నప్పుడు కూడా రైతు బంధు పడిందని చెప్పారు. అప్పుడు బిజెపి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు ఉత్తమ్.
విద్యుత్ విషయంలో కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఉత్తమ్. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారని తెలిపారు. కొనుగోలు విషయంలో ఎక్కడ ఆలస్యం కాలేదన్న ఉత్తమ్.. ధాన్యం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రధాని, అదానీకి ఉన్న సంబంధం ఏంటో మోడీ చెప్పాలని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి పై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా ఉత్తమ్.