టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు ట్రైనింగ్: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా  65 ఐటీఐ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, అప్రెంటీస్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ లో పర్యటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

రామస్వామిగట్ట దగ్గర ITI కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. నల్గొండ ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామస్వామిగట్టులో 40 కోట్లు నిధులతో ITI కాలేజీ నిర్మిస్తోంది ప్రభుత్వం. 
 
గత పది సంవత్సరాల్లో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఒక్క ఉద్యోగం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి వివరించారు. పారదర్శకంగా ఇల్లు లేని వారికి ఇళ్లు ఇవ్వడానికి 78 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తు్న్నామని అన్నారు. హుజుర్ నగర్ పట్టణములో కోటి రూపాయలతో మినీ స్టేడియం మంజూరు చేస్తామని, పట్టణములో మిగిలి పోయిన పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.