ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు..అధికారులపై సీరియస్

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు..అధికారులపై సీరియస్

 తెలంగాణలో  రైతులు పండించిన ప్రతీ పంటను కొనుగోలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  సూర్యాపేట జిల్లా వేపాల సింగారంలో ధాన్యం రాశులను పరిశీలించారు ఉత్తమ్. ధాన్యం దిగుబడి ఎలా వచ్చిందని రైతులను అడిగారు. సమయానికి లారీలు రావడం లేదంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు రైతులు. వెంటనే స్పందించి.. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు మంత్రి ఉత్తమ్. ట్రాన్స్ పోర్ట్ లో ఆలస్యం చేయొద్దని సూచించారు ఉత్తమ్. 

చింతలపాలెం మండలంతో  30 సంవత్సరాల అనుభందం

మేళ్లచెరువు నుండి చింతలపాలం, చింతలపాలెం నుండి చింత్రాయాల వరకు రోడ్డు మంజూరు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. మళ్లీ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేశానని చెప్పారు. పోలీస్ స్టేషన్, తహసీల్దార్, మండలం ప్రజా పరిషత్ కార్యాలయానికి శంకుస్థాపన చేశానన్నారు.  ఉమ్మడి ఆంధ్రాప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో  చింతలపాలెం మండలం కేంద్రానికి రెండు కోట్ల రూపాయలు తో సీసీ రోడ్డు మంజూరు చేశానన్నారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మండలం అభివృద్ధికి ఎల్లపుడు కృషి చేస్తానన్నారు ఉత్తమ్.