రేషన్​బియ్యం అక్రమ రవాణాపై విచారణకు మంత్రి ఉత్తమ్​ ఆదేశం

నల్గొండ, వెలుగు : జిల్లాలో రేషన్​ బియ్యం అక్రమ రవాణాపై ఇరిగేషన్, సివిల్​సప్లై శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. హాలియా, పెద్దవూరలో అమ్మ రైస్​మిల్లుకు రేషన్​బియ్యం అక్రమంగా తరలించడంతో పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెలుగు దినపత్రికలో మూడు రోజులుగా ప్రచురించిన కథనాలపై మంత్రి ఉత్తమ్​స్పందించారు. రేషన్​ బియ్యం అక్రమ రవాణాపై విచారణకు ఆదేశించామని, త్వరలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్​ బియ్యం అక్రమ రవాణా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ కూడా రద్ధు చేస్తామని హెచ్చరించారు.