కోదాడ/మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువులు, కుంటల ఆక్రమణల కారణం గానే వరదలు వచ్చాయని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసు కుంటామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. కోదాడలోని తమ్మరవాగు బ్రిడ్జి, రాష్ట్ర బార్డర్‌లోని పాలేరు వాగు బ్రిడ్జిని సోమవారం మంత్రి పరిశీ లించి మాట్లాడారు. రాష్ట్రంలో చెరువులు, వాగుల పరిరక్షణకు ఇప్పటికే చట్టాలున్నాయని, వాటిని పటిష్టంగా అమలుచేస్తామన్నారు.
హైదరాబాద్ – విజయవాడ రహదారిలో రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద హైవే తెగిపోయిందని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. రోడ్డు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట జిల్లాలో వరద నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు.
Also Read :- మణుగూరులో అడ్డూఅదుపులేని ఆక్రమణలు
ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి ఉన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని వారం రోజుల్లోగా పూడ్చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి సోమవారం గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు.