నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని.. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి లంబాడీల సహకారం ఎంతో ఉందని... పార్లమెంటులో రిజర్వేషన్ల కోసం కొట్లాడి దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభాకు చట్టబద్దత తీసుకొచ్చామని అన్నారు.
బీఆర్ఎస్ గ్రామపంచాయితీలు చేసింది తప్ప మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో అంగన్వాడీ, పంచాయితీ స్కూళ్ళు నిర్మించామని అన్నారు. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తున్నామని.. ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులు సన్నబియ్యం 6కిలోలు ఇవ్వబోతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మిగిలిన గిరిజనులకు భూములు ఇవ్వబడుతాయని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.