ప్రేమ్ లాల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా ఆదుకుంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రేమ్ లాల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా ఆదుకుంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇందిరా భవన్ లో నిర్వహించిన ప్రేమ్ లాల్ సంతాపసభలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమలాల్ లాంటి క్రమశిక్షణతో పని చేసిన నాయకుడు లేకపోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఎలాంటి పార్టీ పని అప్పగించిన చిత్తశుద్ధి తో పని చేసిన నాయకుడు ప్రేమలాల్ అన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకులను పార్టీ గుర్తించాలని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.ప్రేమ్ లాల్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా ఆదుకుంటానని అన్నారు.

అనేక కష్టాలు, నష్టాలు అనుభవించి పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు పని చేయడం వల్లనే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మనం కార్యకర్తలను, నాయకులను ఆదుకోవాలని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల నుంచి ప్రేమ్ లాల్ తో తనకు స్నేహం ఉందని... ఇద్దరం కార్పొరేషన్ చైర్మన్ లుగా పని చేసామని అన్నారు. 

ప్రేమ్ లాల్ స్వచ్ఛమైన హిందీ మాట్లాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని.... చాలా క్రమశిక్షణ, ఓపిక ఉన్న నాయకుడని అన్నారు. ప్రేమ్ లాల్ మరణం పార్టీకి తీరని లోటు అని.. పార్టీ చెప్పిన పని చేస్తూ క్రమశిక్షణ గా ఉన్న నాయకులు ప్రేమ్ లాల్ అని అన్నారు. ప్రేమ్ లాల్ కుటుంబానికి అండగా పార్టీ నిలబడుతుందని.. పార్టీ లో కష్టపడ్డ కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమని అన్నారు.