SLBC టన్నెల్ రెస్క్యూపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: మంత్రి ఉత్తమ్..

SLBC టన్నెల్ రెస్క్యూపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: మంత్రి ఉత్తమ్..

SLBC టన్నెల్ రెస్క్యూ నాలుగోరోజు కొనసాగుతోంది. శనివారం ( ఫిబ్రవరి 21, 2025 ) జరిగిన ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ జరుగుతోంది. నాలుగురోజులుగా రెస్క్యూ కొనసాగుతున్నప్పటికీ కార్మికుల లబ్న్చాకపోవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డు కీలక వ్యాఖ్యలు చేశారు. రెస్క్యూ కొనసాగుతోందని.. రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని అన్నారు. నాలుగు రోజులుగా రెస్క్యూ కొనసాగుతున్నప్పటికీ కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ్.

నేవి, ఆర్మీ నిపుణులతో మాట్లాడమని.. జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని అన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనుభవజ్ఞులందరినీ సంప్రదించామని.. రాబిన్ కంపెనీకి ప్రపంచంలోనే పేరు ఉందని అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు.

Also Read:-ఢిల్లీకి సీఎం రేవంత్.. అట్నుంచి అటు కుంభమేళాకు వెళ్లే అవకాశం..

2005లో SLBC టన్నెల్ ను కాంగ్రెస్ ప్రారంభించిందని అన్నారు. ఈ టన్నెల్ ద్వారా గ్రావిటీతో లక్షల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. SLBC టన్నెల్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఇంత అద్భుతమైన ప్రాజెక్టును పదేళ్లు పక్కనపెట్టారని మండిపడ్డారు ఉత్తమ్. సీఎం సలహాతో బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.