హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఐరా రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన స్క్వేర్ ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఆదిభట్లలోని ఔటర్ రింగ్ రోడ్, ఏరోస్పేస్ హబ్‌లకు సమీపంలో దీనిని నిర్మిస్తున్నారు.
ప్రాజెక్ట్ 13.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 3,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల 131 నాలుగు బెడ్రూమ్ విల్లాలు ఉంటాయి. ప్రతి విల్లాలో ఇంటి ఆటోమేషన్, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లు వంటి సదుపాయాలు ఉంటాయని ఐరా రియాల్టీ చైర్మన్ నర్సి రెడ్డి చెప్పారు. జిమ్, సెమీ-కవర్డ్ స్విమ్మింగ్ పూల్, బాంకెట్ హాల్‌తోపాటు అనేక వినోద సౌకర్యాలను అందిస్తామని ఆయన చెప్పారు.