అసత్య ప్రచారాలు నమ్మొద్దు
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్ : గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్లికేషన్ల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ‘గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. ఖాళీ స్థలం ఉన్నా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్లు పంపించవచ్చు. ప్రస్తుతం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తాం. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దు’ అని మంత్రి కోరారు.