ముందస్తు ఎన్నికలకు వెళ్లం : మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ : ముందస్తు ఎన్నికలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఐదేళ్లు పరిపాలించమని  అధికారం ఇచ్చారని, అందుకే పూర్తికాలం అధికారంలో ఉంటామని అన్నారు. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రజల్లో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.