పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ తేజావత్ సుకన్యని మంత్రి వెంకట్ రెడ్డి అభినందించారు

  •     గోల్డ్ మెడల్  సాధించిన తేజావత్ సుకన్యను సన్మానించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ తేజావత్ సుకన్య బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. శాలువాతో సత్కరించి, పోటీలు జరిగిన తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో తేజావత్ సుకన్య గోల్డ్ మెడల్ సాధించారు. 

భారత్ తరఫున 76 కిలోల విభాగంలో పతకాన్ని గెలుపొందారు. మంత్రిని కలిసిన తర్వాత తేజావత్ సుకన్య మాట్లాడారు. తాను సౌతాఫ్రికా వెళ్లడానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. తన లాంటి ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయ, సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. దేశం తరఫున మరిన్ని పతకాలు సాధించేందుకు అండగా నిలబడతానని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.