![బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిందే మీరు .. కేటీఆర్ ట్వీట్‌పై మంత్రి వెంకటరెడ్డి ఫైర్](https://static.v6velugu.com/uploads/2025/02/minister-venkat-reddy-fired-over-brs-mla-ktr-criticism-of-rahul-gandhi-delhi-results_dBspnvY5F7.jpg)
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ రిజల్ట్స్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం మీ సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం మీది.
రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బీఆర్ఎసే కారణం” అని పోస్ట్ చేశారు.