వరంగల్, వెలుగు : కుక్కల దాడిలో గాయపడి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న గ్రేటర్ పరిధిలోని 21వ డివిజన్‌కు చెందిన అలీ అక్బర్‌ను సోమవారం మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్బర్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వంపరంగా కృషి చేస్తామని చెప్పారు. వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆదేశించారు. ఆమె వెంట కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఉన్నారు.
ఉర్సుకు ఏర్పాట్లు చేయండి
వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో జరగనున్న హజ్రత్ మషూక్ రబ్బానీ ఉర్సుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. సోమవారం కరీమాబాద్‌లో నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. మరుగుదొడ్ల ఏర్పాటు, శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఉర్సు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మంత్రి హాజరయ్యారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పాల్గొన్నారు.