నెట్వర్క్, వెలుగు: భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేశ్ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చొక్కా పట్టుకొని నెట్టేసి, చెంప దెబ్బ కొట్టడాన్ని ఉమ్మడి జిల్లాలోని ఉద్యమకారులు, గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్‌లో మంత్రి చిత్రపటానికి చెప్పుల దండ వేసి శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రాజేశ్‌బాబుకు మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. లేకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తలసానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుభీర్ మండల బంద్‌కు గిరిజన నాయకులు పిలుపునిచ్చారు. కుంటాలలో బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు జుట్టు మహేందర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాజేశ్ బాబుపై దాడిని ఖండిస్తున్నామని బంజారా సంఘం నిర్మల్ జిల్లా నేత నరేందర్ రాథోడ్ ఓ ప్రకటనలు పేర్కొన్నారు.