పర్యాటక ప్రాంతాలపై మంత్రి రివ్యూ

పర్యాటక ప్రాంతాలపై మంత్రి రివ్యూ

హైదరాబాద్ సిటీ, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌‌ నియోజకవర్గంలో చేపట్టనున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై బుధవారం హైదరాబాద్‌‌లోని జలసౌధలో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగూరు డ్యామ్‌‌ బ్యూటిఫికేషన్, ఐల్యాండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌, గార్డెన్‌‌ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను మంత్రి పరిశీలించారు. ఆంధోల్‌‌, సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పెంచేలా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆంధోల్‌‌ చెరువు బ్యూటిఫికేషన్‌‌కు డిజైన్లు రూపొందించాలని ఆపీసర్లను ఆదేశించారు. రివ్యూలో పర్యాటకశాఖ డిప్యుటీ ఈఈ నటరాజ్, ఆర్కిటెక్ట్‌‌ విజయ్‌‌ కుమార్‌‌, సివిల్‌‌ ఇంజినీర్‌‌ వినీత్‌‌ ఉన్నారు.