ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్

జనజాతర సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు 
జగిత్యాల జిల్లాలో జనజాతర సభ సక్సెస్​
భారీగా హాజరైన జనం 

మెట్ పల్లి/ కోరుట్ల: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రిజర్వేషన్లను మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం చౌలమద్ది శివారులో జరిగిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. ఒకవేళ మళ్లీ గెలిస్తే బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు. రాహుల్ గాంధీ కులగణన సర్వే చేస్తామని ప్రకటిస్తే అడ్డుకునేందుకు బీజేపీ సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిందన్నారు. 

ప్రజా సమస్యలపై అవగాహన, అనుభవం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డిని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ పదవి ఉన్నా లేకపోయినా రైతులు, ప్రజల కోసం పోరాడిన నేత జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కొనియాడారు. జగిత్యాల జిల్లా చెరకు రైతుల కోసం షుగర్​ ఫ్యాక్టరీని మేనిఫెస్టో లో చేర్చేందుకు, గల్ఫ్ కార్మికుల కోసం ఎన్​ఆర్​ఐల సంక్షేమానికి జీవన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. 

కులమతాల విద్వేషాలు చెలరేగుతాయి : చాడ వెంకట్ రెడ్డి

కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చులు పెరుగుతాయని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బీజేపీ మూడోసారి గెలిస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉండవన్నారు. 

జగిత్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేశా: జీవన్ రెడ్డి

దివంగత సీఎం వైఎస్ హయాంలో జగిత్యాలను అభివృద్ధి చేశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గెలిచినా ఓడినా ప్రజా సేవ చేసేందుకు అందుబాటులో ఉన్నానన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదని, ప్రజా సేవ కోసం సీఎం సూచన మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ప్రకటనకే పరిమితమైందన్నారు. జగిత్యాలకు మ్యాంగో మార్కెట్,  అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్  కాలేజీ ఏర్పాటుకు కృషి చేశానన్నారు. గల్ఫ్ కార్మికులకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు బోర్డు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వివరించారు.  

జనజాతర సభ సక్సెస్ 

నిజామాబాద్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన జనజాతర సభ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాంగ్రెస్ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జోష్ నెలకొంది. చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హాజరైన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  ప్రసంగం ప్రజలను ఉర్రూతలూగించింది.

 కాంగ్రెస్ లీడర్, సినీనటి దివ్య వాణి స్టేజీపై కండువా ఊపుతూ డ్యాన్సులు చేస్తూ స్టేజీపై సందడి చేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో లీడర్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, చిన్నారులు సభకు తీసుకురావద్దంటూ కార్యకర్తలకు సూచించారు. సభకు దాదాపు 40వేల మంది హాజరయ్యారు. ఉక్కపోతకు గురికాకుండా సీలింగ్ టెంట్లు, వాటర్ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కావడంతో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.