‘వీ6 వెలుగు’పై మంత్రుల అక్కసు

‘వీ6 వెలుగు’పై మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ప్రజల పక్షాన ప్రశ్నలడ గడమే తప్పు అన్నట్టుగా మీడియా ప్రతినిధులను మీది ‘ఏ పత్రిక’.. ‘ఏ చానల్‌‌‌‌’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మళ్లీ తమనెవ్వరూ ప్రశ్నించొ ద్దన్న ధోరణిని బాహాటంగా చాటుకున్నారు. కేటీఆర్‌‌‌‌తో పాటు మరో మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌.. వీ6 చానల్‌‌‌‌, వెలుగు పేపర్‌‌‌‌పై ఒకేరోజు ఇలా రియాక్ట్‌‌‌‌ అయ్యారు.

- హైదరాబాద్‌‌‌‌, వెలుగు

మీది వెలుగా?
మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డ్రగ్స్‌‌‌‌ కేసులో బండి సంజయ్‌‌‌‌ ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని ఒక మీడియా ప్రతి నిధి కేటీఆర్‌‌‌‌ను ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్‌‌‌‌ స్పందిస్తూ ‘‘మీదేంది వెలుగా.. గదే అర్థమైంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌‌‌‌ కేసులో ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమంటూనే ఫ్రస్ట్రేషన్‌‌‌‌ వెళ్లగక్కారు. బండి సంజయ్‌‌‌‌పై కోపంతో ఊగిపోతూ.. వెలుగుపై అసహనం వ్యక్తం చేశారు.

మీది వీ6 చానలా?
ఎక్సైజ్‌‌‌‌ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ మంగళవారం రంగారెడ్డి జిల్లా హయత్‌‌‌‌ నగర్‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో పట్టుబడిన నకిలీ మద్యం, లిక్కర్ తయారు చేసే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బెల్ట్‌‌‌‌ షాపుల మూసివేతపై ప్రశ్న వేసిన వీ6 ప్రతినిధికి సరైన సమాధానం చెప్పకపోగా.. మీది ఏ చానలో చెప్పాలంటూ పదే పదే ప్రశ్నించారు. ‘‘బెల్ట్‌‌‌‌ షాపుల లిస్ట్‌‌‌‌ మీ వీ6 దగ్గర ఉంటే ఇయ్యరాదు చర్యలు తీసుకుంటం..” అంటూ సెటైరికల్‌‌‌‌గా మాట్లాడారు. ‘‘తాగే వాడు ఈడ దొరక్కపోతే ఇంకోకాడ తెచ్చుకుంటడు.. అక్రమ మద్యమా.. నకిలీ మద్యమా అన్నది ప్రశ్న.. మద్యపాన నిషేధం లేదు కదా.. దేశవ్యాప్తంగా పెడితే తెలంగాణల ఫస్ట్‌‌‌‌ పెడుతం.. ఈడ పెడితే కర్నాటక నుంచి వస్తది మాఫియా. బెల్ట్‌‌‌‌ షాపుల లిస్ట్‌‌‌‌ మీ వీ6 వాళ్ల దగ్గర ఉంటే ఇవ్వండి. కంప్లైంట్‌‌‌‌ ఇస్తే కేసు బుక్‌‌‌‌ చేస్తం’’ అని అన్నారు.