
హైదరాబాద్, వెలుగు: భదాద్రిలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రాములోరి కల్యాణ వేడుకలకు రావాలని కోరుతూ దేవాదాయశాఖ అధికారులు శనివారం మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందించారు. అసెంబ్లీ లాబీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ల చాంబర్‌కు వెళ్లి వారికి స్వామివారి ప్రసాదం అందజేసి వేదాశీర్వాచనం ఇచ్చి రాములోరి కల్యాణ వేడుకలకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ స్వామివారి కల్యాణానికి దేశ నలుమూల నుంచి భక్తులు వస్తారని, వారికి ఎలాంటి లోటు రానివ్వకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.