హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసే వేళ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారానికి వెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారపర్వం ముగియనుంది. ఆలోగా ఇద్దరు మంత్రులు నాలుగు మండలాల్లో రోడ్ షోలు చేసేలా షెడ్యూల్ రూపొందించారు. మునుగోడు, సంస్థాన్ నారాయణపురంలో కేటీఆర్.. , నాంపల్లి, చండూరులో హరీశ్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. వీరి ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా టీఆర్‌ఎస్ స్థానిక నాయకత్వం కసరత్తు చేస్తోంది.