- మహిళా సాధికారిత కోసమే ఇందిరమ్మ క్యాంటీన్లు
- పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం కృషి చేస్తాం
- మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క
మహబూబాబాద్, వెలుగు : కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు, మహిళా సంక్షేమం కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం కేంద్రంలో అమృత్ పథకం నిధుల కింద రూ.25.58 కోట్లతో నిర్మించే వాటర్ట్యాంక్పనులు, మహిళ సాధికారికతకు ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత్సవం, మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ రూ.5 లక్షలు, అబ్బాయపాలెంలో అంగన్వాడీ మోడల్ కేంద్రం, కురవి మండలం అయ్యగారిపల్లిలో రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా పాఠశాలల భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి రుణమాఫీ, రైతు భరోసా పథకాలు అమలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేస్తూ, సన్న రకాలకు రూ.500 బోనస్ తోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పేదవారి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టి రూ.5 లక్షలతో ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సహకారం చేస్తున్నట్లు తెలిపారు. పేదలందరికీ కార్పోరేట్ స్థాయిలో విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామని, అయ్యగారిపల్లిలో రూ.125 కోట్లతో అత్యాధునిక వసతులతో పాఠశాలల సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు.
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం వడ్డీలేని రుణాలు, ఇందిరా శక్తి క్యాంటిన్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉచిత బస్సు సర్వీసు, పేద విద్యార్థులకు భారం కాకుండా మెస్ చార్జీలు పెంచడం, క్షేత్రస్థాయిలో గ్రామీణ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలాంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ నూతన మార్కెట్‌కమిటీ చైర్మన్ ఇస్లావత్సుధాకర్, వైస్చైర్మన్మదన్గోపాల్లోయ, మార్కెట్డైరెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీర బ్రహ్మచారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.