
విదేశాల్లో అధ్యయనం చేసి వచ్చాకే మూసీ శుద్ధి, సుందరీకరణపై ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ లో చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలోనే మూసీ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తెస్తామంటే చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మూసీ ప్రాజెక్టుకు వ్యయం అంచనా ఇంకా ఫైనల్ కాలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో టూరిజం పెరుగుతుందన్నారు. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపుతోందన్నారు. ఏపీకి రూ. 90 వేల కోట్లు ఇచ్చి.. తెలంగాణకు రూ. 50 వేల కోట్లే ఇచ్చిందన్నారు. మూసీతోపాటు అన్ని ప్రాజెక్టులకూ రేషియో ప్రకారం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.