పంజాగుట్ట, వెలుగు : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం పరామర్శించారు. గుండె, కిడ్నీ తదితర మల్టిపుల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న మందా జగన్నాథం.. చికిత్స కోసం ఈ నెల 22న నిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
ఆర్ఐసీయూలోలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని డాక్టర్లకు సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోమవారం మందా జగన్నాథంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో దాసోజు శ్రవణ్ ఉన్నారు.