7 లక్షల కోట్ల అప్పులు చేసి అవతల పడ్డరు: మంత్రి సీతక్క

 కాంగ్రెస్ పాలనను చూడలేకే బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.రుణ మాఫీ చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

Also Read :- ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లే వాహనదారులకు అలర్ట్

బీఆర్ఎస్ నేతలు  7 లక్షల కోట్లు అప్పులు చేసి బయటపడ్డారని తెలిపారు సీతక్క. 10 ఏళ్లలో  ఉద్యోగాలు ఇవ్వనీ బీఆర్ఎస్ ఇప్పుడు   కొలువు కోసం కొట్లాడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా  ఇబ్బందులు పెట్టిన నాయకులే ఇప్పుడు  ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు.  జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ధరణి వల్ల సామాన్యులు, పేద రైతులు  చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  ధరణిని  భూమాతగా మారుస్తామంటే అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీ నగర్ దగ్గర 60 ఎకరాల్లో  ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు.. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడారు.. భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఈరోజు చాలా శుభపరిణామం అని అన్నారు. వర్షాలతో దెబ్బతిన్న రహదారుల నిర్మాణానికి 97 కోట్లు మంజూరు చేశామన్నారు..త్వరలోనే ములుగులో స్థల సేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎలా క్రియేట్ చెయ్యాగలమో మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో చేస్తామన్నారు.