కులవృత్తుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. మునుగోడులో పర్యటించిన మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డి కిష్టాపురం చెరువులో చేపపిల్లలను వదిలారు. అంతకుముందు గ్రామంలో పశువులకు వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని తెలంగాణ ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి సీఎం కావడం అదృష్టమన్నారు. విద్యా వైద్యంలో అద్భుత ప్రగతి సాధించింది తెలంగాణనే అని అన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. మునుగోడుకు వస్తున్న కొందరు నేతలు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారని..వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
మునుగోడులో ఒక్క ఫ్లోరోసిస్ కేసు లేదు
60 ఏళ్ల పాలనలో కులవృత్తులను పట్టించుకోలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సీఎం కేసీఆర్ నిలబెట్టారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు లేదని.. దానికి కారణం కేసీఆర్ ఇంటింటికి కృష్ణ జలాలు ఇచ్చి ప్లోరిన్ ను పారద్రోలాడన్నారు. చెరువులు కలకలలాడుతున్నాయంటే దానికి కారణం దానికి కేసీఆరే కారణమన్నారు.