ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు.. ఆరు కేజీల సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు.. ఆరు కేజీల సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజుర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఆరు కేజీలు సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84 శాతం మందికి సన్న బియ్యం అందుతాయని ఆయన వెల్లడించారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకున్నారని చెప్పారు.

ALSO READ | డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం..డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క

నీటి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఉత్తమ్ తెలిపారు. కృష్ణా జలాల్లో కొంచెం నీటి కొరత ఉండటం వాస్తవమేనని, శ్రీశైలం నుంచి కరెంట్ తయారుకు నీటిని విడుదల చేసి వాటిని సాగర్ ప్రాజెక్ట్లోకి విడుదల చేస్తామని ప్రకటించారు. దీని వల్ల కొంత నీటి కొరత తగ్గుతుందని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం ఎండినా రాష్ట్ర సర్కార్‌‌‌‌దే బాధ్యత అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. ఈ ఎండా కాలంలో వరి ఎంత వేయాలో రైతులకు తెలుసని చెప్పారు. ప్రాజెక్టుల కింద వరి పంటలకు సాగు నీరు అందేలా చూసేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామని ఆయన తెలిపారు.