‘అండగా ఉంటాం’.. వరద బాధితులకు మంత్రుల హామీ

‘అండగా ఉంటాం’.. వరద బాధితులకు మంత్రుల హామీ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పర్యటించారు. వరద బాధితులతో అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఏపీ నుంచి హెలికాప్టర్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఖమ్మం ప్రకాశ్‌‌ నగర్‌‌ బ్రిడ్జి వద్ద ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌ టీమ్‌‌ చేపట్టిన సహాయక చర్యల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో సాగర్‌‌ కాల్వకు గండి పడిన ప్రదేశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి బైక్‌‌పై వెళ్లి పరిశీలించారు.

 అలాగే పాలేరు రిజర్వాయర్ వరద నీటితో ముంపునకు గురైన నాయకన్‌‌ గూడేన్ని పరిశీలించారు. ఖమ్మంలో మున్నేరు బాధిత కాలనీల్లో ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి పొంగులేటి పర్యటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో వరద సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం ఎర్రుపాలెం మండలంలో పర్యటించారు. వరదలో గల్లంతయిన సాంబ కుటుంబాన్ని పరామర్శించి, వరద బాధితులకు ధైర్యం చెప్పారు.