10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎలాంటి పరీక్ష లేకుండానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) ఫైర్‌మెన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mod.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 23 2024.
- పోస్టుల వివరాలు: ఫైర్‌మెన్
- మొత్తం ఖాళీలు : 40 రక్షణ మంత్రిత్వ శాఖ కన్నూర్, కొచ్చిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
- కన్నూర్‌లో మొత్తం పోస్టులు- 02
- కొచ్చిలో మొత్తం పోస్టులు- 38వయస్సు : అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు మించకూడదు.
- విద్యార్హత: 10 వ తరగతి ఉత్తీర్ణత
- జీతం వివరాలు: రూ.19,900 నుండి రూ.63,200
దరఖాస్తు చేయు విధానం ( ఆఫ్ లైన్)
దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు mod.gov.in అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. వెబ్ సైట్ లో అడిగిన వివరాలను పూర్తి చేసి... దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ జతచేసి... ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, {స్టాఫ్ ఆఫీసర్ (సివిలియన్ రిక్రూట్‌మెంట్ సెల్)} హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్ నేవల్ బేస్, కొచ్చి – 682004 చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మే 23 వ తేదీనాటికి పంపాలి.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ...
నోటిఫికేషన్ ప్రకారం అన్ని వివరాలు సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులను ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూట్ మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తారు.