10 విమానాలకు బాంబ్ బెదిరింపులు.. హై లెవల్ మీటింగ్‎కు పిలుపునిచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

10 విమానాలకు బాంబ్ బెదిరింపులు.. హై లెవల్ మీటింగ్‎కు పిలుపునిచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

విమానాలకు వరుస బాంబ్ బెదిరింపు కాల్స్, మేసేజ్‎లు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దాదాపు 10 విమానాలను పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాలకు వరుస బాంబ్ థ్రెట్ కాల్స్, మేసేజ్‎లు రావడంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు 2024, అక్టోబర్ 16వ తేదీన ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది. 

ఈ హై లెవల్ మీటింగ్‎లో విమానాలకు వస్తోన్న వరుస బాంబ్ బెదిరింపులపై అధికారులు చర్చించనున్నారు. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో విమానాలకు థ్రెట్ కాల్స్ రావడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం (అక్టోబర్ 14) బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, సీఐఎస్ఎఫ్, ఇతర విమానాశ్రయ భద్రత సిబ్బందితో భేటీ అయ్యారు. విమానాలకు వస్తోన్న వరుస బాంబు బెదిరింపు ఫోల్స్ కాల్స్, సందేశాలపై మంత్రి ఆరా తీశారు. 

ALSO READ | అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కెనడాకు దారి మళ్లింపు

నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన మంత్రి.. ప్యాసింజర్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలన్నారు. విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపులను పోలీస్, సీఐఎస్ఎఫ్ వర్గాలు దృవీకరించాయి. విమానాలలో బాంబుల గురించి సోషల్ మీడియాలో బెదిరింపులను పోస్ట్ చేస్తోన్న ఖాతాలను గుర్తించామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇతర దేశాల నుండి కూడా బెదిరింపు కాల్స్, మేసేజ్‎లు వస్తున్నాయని తెలిపారు.