ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, వారసత్వాన్ని తెలిపే డ్రోన్ షో జరిగింది. కాంతులు విజిమ్ముతూ డ్రోన్ విన్యాసాలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఇక్కడే ప్రధాని మోడీ కొత్తగా నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో దశలవారీగా రివ్వున ఆకాశంలోకి ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్ వెలుగుల్ని విరజిమ్ముతూ నేతాజీ చిత్రంగా ఏర్పడటం కన్నులవిందు చేసింది.
ఈ మొత్తం కార్యక్రమంలో 250 డ్రోన్లు పాల్గొన్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. రాత్రి 8.35 నిమిషాలకు ప్రారంభమైన డ్రోన్ విన్యాసాలు 10 నిమిషాల పాటు సాగాయి. వాటిని స్థానికులు తమ సెల్ ఫోన్లలో షూట్ చేసి, సోషల్ మీడియాల్లో పంచుకుంటున్నారు.
#WATCH | Ministry of Culture organises a drone show at the India Gate, in Delhi. pic.twitter.com/Cb3EeywRYI
— ANI (@ANI) September 9, 2022