పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చేయండి: భారతీయులకు విదేశాంగ శాఖ ఆదేశం

పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చేయండి: భారతీయులకు విదేశాంగ శాఖ ఆదేశం

న్యూఢిల్లీ: పహల్గాంలో టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్​పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. మెడికల్ వీసాలకు ఏప్రిల్ 29 వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందని పేర్కొంది. ఆ వీసాపై ఇండియాలో ఉన్నవాళ్లు ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని సూచించింది. కొత్త వీసాల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. పాక్ లో ఉన్న ఇండియన్లకూ పలు సూచనలు చేసింది. 

ఆ దేశంలో ఉన్న వాళ్లు వీలైనంత త్వరగా వచ్చేయాలని, పాకిస్థాన్​కు ప్రయాణాలు చేయవద్దని ఇండియన్స్​కు సూచించింది. కాగా, పహల్గాం దాడిపై చర్చించేందుకు జర్మనీ, జపాన్, పోలండ్, యూకే, రష్యా, చైనా రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. దాడి వివరాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించి మద్దతు కోరారు. పాకిస్థాన్‌‌‌‌కు చెందిన లష్కరే అనుబంధ సంస్థ టీఆర్​ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొంది.  

భారత్​పై పాకిస్థాన్ ఆంక్షలు

ఇండియా నిర్ణయాలపై పాక్‌‌‌‌ స్పందించింది. ఇస్లామాబాద్‌‌‌‌లో జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. వాఘా సరిహద్దును మూసివేయాలని, సిక్కు యాత్రికులు మినహా ఇండియన్స్‎కు సార్క్‌‌‌‌ వీసాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇస్లామాబాద్‌‌‌‌లోని ఇండియన్​ ఎంబసీలో సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించింది. భారత్‌‌‌‌ హైకమిషన్‌‌‌‌లోని మిలటరీ అడ్వైజర్లు ఏప్రిల్‌‌‌‌ 30లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇండియాలో అ‌‌‌‌న్ని రకాల బిజినెస్​లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియా విమానాలు పాక్‌‌‌‌ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యాక్ట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వార్‌‌‌‌గా పరిగణిస్తామని పేర్కొన్నది.