విజయవాడ: కేంద్ర టూరిజం వ్యవహారాల శాఖా మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప గాయం అయింది. జన ఆశీర్వాద యాత్ర కోసం ఆయన గురువారం విజయవాడకు వచ్చారు. నిన్న తిరుపతిలో జన ఆశీర్వాద యాత్ర విజయవంతంగా ప్రారంభించి ఇవాళ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో యాత్ర ముగించుకుని తిరుగు పయనం అవుతున్నప్పుడు కారు ఎక్కుతుండగా కిషన్ రెడ్డి తలకు డోర్ తగిలింది. ఊహించని ఘటన తో పార్టీ శ్రేణులు ఉలిక్కిపడగా ఆయన తనకేమీ కాలేదని సర్దిచెప్పారు. ప్రాథమిక చికిత్స చేయించుకుని తెలంగాణలో జన ఆశీర్వాద సభకు బయలుదేరి వెళ్లిపోయారు.