వానలు కురవాలని దర్గాలో ప్రార్థనలు

వానలు కురవాలని దర్గాలో ప్రార్థనలు

మునిపల్లి, వెలుగు: వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ  మండలంలోని మల్లికార్జున్ పల్లి గ్రామ మైనార్టీ లీడర్లు స్థానిక మైబుసుబాన్​కు గంధం సమర్పించారు. గ్రామ వీధులగుండా ఆటపాటలతో డప్పు చప్పుళ్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి వరకు గంధాన్ని దర్గా వరకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధం ఊరేగింపులో గుర్రం చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

రైతులు పండించిన పంటలకు సరైన సమయంలో వానలు కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండాలని ముస్లింలు దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు అబ్దుల్, ఇస్మాయిల్,  రఫియోద్దీన్, సలావుద్దీన్, సత్తార్, లతీఫ్, ఎండీ పాష, షరీఫ్, పాష, నవాబు, ఖాజు, జహీర్, పాష, అమద్, బాబు, గౌస్, గఫార్​
పాల్గొన్నారు.