మైనార్టీ స్టూడెంట్స్​ అన్నీ రంగాల్లో రాణించాలి : ​అసదుద్దీన్​ ఒవైసీ

మైనార్టీ స్టూడెంట్స్​ అన్నీ రంగాల్లో రాణించాలి : ​అసదుద్దీన్​ ఒవైసీ

బోధన్, వెలుగు: మైనార్టీ స్టూడెంట్స్​అన్నీ రంగాల్లో రాణించాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ పేర్కొన్నారు. బుధవారం బోధన్​టౌన్​లోని అయేషా గార్డెన్​లో ఉర్దూ మీడియం స్కూల్​పిల్లలకు ఆల్​ఇన్​వన్​బుక్స్ పంపిణీ చేశారు. అంతకుముందు పాత బోధన్​లోని జలాల్​బుకారీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పుస్తకాల పంపిణీ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.

తాను కూడా సామన్య స్టూడెంట్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. మైనార్టీ మహిళలు ఇండ్లకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడాలని కోరారు. నాదేండ్ల భాస్కర్ రావు సీఎంగా ఉన్నప్పుడు పార్టీ తరఫున పోరాడి మైనార్టీ స్టూడెంట్స్​కోసం మెడికల్​కాలేజీ ఏర్పాటు చేసేలా కృషి చేసినట్లు చెప్పారు. దీంతో ఏడాదికి 5 వేల మైనార్టీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్​ షకీల్, బోధన్​టౌన్​ప్రెసిడెంట్​ముషీర్​బాబా, ఎంఐఎం కౌన్సిలర్లు వలియొద్దీన్, అక్తర్, అఖిల్, లీడర్లు ఎజాస్, రషీద్, ఖాదర్ పాల్గొన్నారు.