గురుకుల స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ : షేక్ యాస్మీన్ బాషా

గురుకుల స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ : షేక్ యాస్మీన్ బాషా
  • మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా

వనపర్తి టౌన్, వెలుగు : గురుకులాల్లో స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కామన్ డైట్ ను అమలు చేస్తున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా అన్నారు.  సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులు గవర్నమెంట్ గర్ల్స్ హాస్టళ్లు, గురుకులాల్లో బసచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  బుధవారం రాత్రి వనపర్తి జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్టీ గురుకుల గర్ల్స్ హాస్టల్ లో నిద్రించారు. 

గురువారం ఉదయం వనపర్తి ఎమ్మెల్యే   మేఘారెడ్డి తో పాటు స్టూడెంట్లతో కలిసి టిఫిన్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..   ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు 40 శాతం మెస్ చార్జీలు, దాదాపు 200 శాతం కాస్మోటిక్ చార్జీలను ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. అనంతరం, జిల్లా కేంద్రంలోని కేడీఆర్ నగర్ లో ఉన్న  మైనార్టీ గర్ల్స్ జూనియర్ కాలేజీని పరిశీలించారు. 

కళాశాల  హాస్టల్ లోని కిచెన్ ను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు  కార్యక్రమంలో  గిరిజన సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆఫ్జలుద్దీన్,  సరస్వతి,  హవీలా రాణి పాల్గొన్నారు.