మావోయిస్టుల్లో మైనర్లు !

మావోయిస్టుల్లో మైనర్లు !
  •  చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ పోలీసుల చేతిలో మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ నేత సుధాకర్‌‌‌‌‌‌‌‌ లేఖ
  •  130 మంది బాల, బాలికలకు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్లు సమాచారం

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ దండకారణ్యంలోని మావోయిస్టుల్లో మైనర్లు ఉన్నట్లు వస్తున్న వార్త కలకలం రేపుతోంది. మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ నేత సుధీర్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ సుధాకర్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ మురళి అలియాస్‌‌‌‌‌‌‌‌ అంకేసరపు సారాయ్య వద్ద దొరికిన ఒక లెటర్‌‌‌‌‌‌‌‌ను బట్టి చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. సారయ్య మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ పార్టీలో విద్యావిభాగంతో పాటు ఆయుధాల నిర్వహణ, ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ విభాగాన్ని నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల కింద సుమారు 130 మంది బాల, బాలికలను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకొని వారికి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్లుగా లేఖలో పేర్కొన్నారు. మైనర్లకు స్నైపర్‌‌‌‌‌‌‌‌ గన్స్‌‌‌‌‌‌‌‌ వాడటం, బాంబులు తయారు చేయడం, అటాకింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంలో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

9 నుంచి 11 ఏండ్ల చిన్నారులు 40 మంది, 14 నుంచి -17 ఏండ్ల లోపు వారు 40 మంది, 18 నుంచి 22 ఏళ్ల లోపు ఉన్న 50 మందిని రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకొని గెరిల్లా యుద్ధతంత్రాలు, ఫైటింగ్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌, వెపన్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్లింగ్‌‌‌‌‌‌‌‌, ఐఈడీల తయారీపై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల కింద నార్త్‌‌‌‌‌‌‌‌ బస్తర్ బ్యూరో ఆఫ్​నక్సలైట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మాఢ్​అటవీ ప్రాంతంలో సీసీఎం, డీకేఎస్‌‌‌‌‌‌‌‌జెడ్‌‌‌‌‌‌‌‌సీ కేడర్‌‌‌‌‌‌‌‌కు చెందిన నక్సలైట్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లుగా సుధాకర్‌‌‌‌‌‌‌‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకలాపాలు, నష్టాలు, విజయాలు, సవాళ్లను రివ్యూ చేశారు. మాఢ్​ప్రాంతంలో గ్రామసభ పెట్టి రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు.

వారికి పార్టీ సిద్ధాంతాలు, రాజకీయాలు, పోరాటాల్లో మాత్రమే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చామని, ఇంకా పోరాడేందుకు వారు అర్హత సాధించలేదని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. లొంగుబాట్లు, ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్లతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని, రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లు జరగకపోతే పార్టీ మనుగడ కష్టమేనని సమావేశంలో చర్చించినట్లుగా సుధాకర్‌‌‌‌‌‌‌‌ తన లేఖలో రాశారు. 18 నుంచి 22 ఏండ్ల లోపు యువకులకు మాత్రమే ఆయుధాలు ఇచ్చి ఇంద్రావతి ఏరియా కమిటీలో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశామని, మిగిలిన వారికి ఇంకా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.