మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా : ఏసీపీ శ్రీనివాస్

బోధన్, వెలుగు : మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా తప్పదని ఏసీపీ శ్రీనివాస్​హెచ్చరించారు. శుక్రవారం బోధన్​పట్టణ శివారులోని ఇందూర్ స్కూల్​లో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతిఒక్కరూ హెల్మెంట్ ధరించాలని సూచించారు. మానవ తప్పిదాలతో ఏటా మన దేశంలో లక్షలాది మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని చెప్పారు.

కొంతమంది డ్రైవింగ్​చేసే సమయంలో సెల్​ఫోన్, హెడ్​ఫోన్స్​పెట్టుకొని వాహనాలు నడుపుతున్నారని తెలిపారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది బైక్​పై ప్రయాణం చేయడం ప్రమాదకరమన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్​రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకట నారాయణ, మోటర్ వెహికిల్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్​, ట్రాఫిక్ సీఐ చందర్​రాథోడ్​, ఇందూర్​స్కూల్​ కరస్పాండెంట్ కొడాలి కిశోర్, హెడ్మాస్టరు రామరావు, విద్యార్థులు పాల్గొన్నారు.