హైదర్ గూడలో కారు బీభత్సం.. డివైడర్ ఎక్కించిన మైనర్లు

హైదరాబాద్ లోని  హైదర్ గూడలో కారుతో  బీభత్సం సృష్టించారు ఇద్దరు మైనర్లు. హైదర్ గూడ నుంచి హిమాయత్ నగర్ వైపు వెళ్తుండగా  ర్యాష్ డ్రైవింగ్ తో  తెలుగు అకాడమీ ఎదురుగా అదుపు తప్పి డివైడర్ పై ఎక్కించారు.   ఇద్దరు యువకులు  స్వల్ప గాయాలతో  బయటపడ్డారు.   అటుగా వెళ్తున్న వాహనదారుడు కిందపడ్డారు. దీంతో  నిర్లక్ష్యంగా కారు నడిపిన  మైనర్లను  వాహనదారులు చితకబాదారు. 

 సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణ గూడ పోలీసులు... కారులో ఉన్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.  కారును పీఎస్ కు తరలించారు.  డ్రైవింగ్ చేసింది మైనర్ కావడంతో  వారి తల్లిదండ్రులను పిలిపించి  కౌన్సిలింగ్ ఇచ్చారు నారాయణగూడ పోలీసులు.