OpenAI తాత్కాలిక సీఈవో మీరా మురాటి.. అల్బేనియా నుంచి సిలికాన్ వ్యాలీ వరకు

OpenAI తాత్కాలిక సీఈవో మీరా మురాటి.. అల్బేనియా నుంచి సిలికాన్ వ్యాలీ వరకు

OpenAIతన CEO సామ్ ఆల్ట్మన్ను తొలగించినట్లు శుక్రవారం ప్రకటించడంతో.. AI ఆధారిత చాట్ బాట్ ChatGPT lr మాతృ సంస్థ తాత్కాలిక CEO గా మీరా మురాటి బాధ్యతలు స్వీకరించారు. మురాటి (35) చాట్ జీపీటిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు.

తాత్కాలిక OpenAI CEO గా బాధ్యతలు చేపట్టిన మీరా మురాటి ..అల్బేనియా సంతతికి చెందినది. 16యేళ్ల వయసులో అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారు. 2018లో OpenAI లో దాని AI దాని భాగస్వామ్యాలలో వైస్ ప్రెసిడెంట్ గా చేరిన తర్వాత.. ఆమె 2020లో పరిశోధన, ఉత్పత్తి, భాగస్వామ్యాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొంది. 2022 లో మురాటి  OpenAI చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గా బాధ్యతలు స్వీకరించారు. చిన్న స్టార్టప్ కంపెనీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైల్ బ్లేజర్ గా ఎదగడంతో మురాటి కీలక పాత్ర పోషించారు. 

AI గవర్నె్న్స్, పాలసీలో ఆమె అనుభవం, కంపెనీకి చెందిన అన్ని విభాగాలలో పనిచేసిన అనుభవం వంటి అర్హతలతో  బోర్డు ఆమెను ప్రత్యేకంగా ఓపెన్ ఏఐ తాత్కాలిక CEOగా నియమించింది. నైతిక సూత్రాలకు స్థిరమైన నిబద్ధత, ఆత్యాధునిక AI కి పర్యాయపదంగా మారిన కంపెనీకి నాయకత్వం వహించే సవాళ్లను ఆమె ఎలా నావిగేట్ చేస్తారనే దాని ద్వారా తాత్కాలిక సీఈవో మురాటి పదవీ కాలం ఆధారపడి ఉంది.