
భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అథ్లెట్ల కమిషన్ చైర్ పర్సన్ గా ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను ఎన్నికయ్యారు. చాను టోక్యో ఒలింపిక్ క్రీడల 49కేజీ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రతజం గెలుచుకున్నారు. సమాఖ్య అథ్లెట్ల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నందుకు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వెయిట్ లిఫ్టర్ల గొంతుకగా పనిచేస్తానన్నారు.
29 ఏళ్ల చాను నియామకం భారత వెయిట్ లిఫ్టింగ్‌లో కీలక మలుపు. చాను టోక్యో 2020లో రజత పతకం ,2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం సాధించి భారత్ కు వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ గుర్తింపును తెచ్చారు. స్నాచ్‌లో 88 కేజీలు,క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీల బెస్ట్ లిఫ్ట్‌లతో 49 కేజీల విభాగంలో జాతీయ రికార్డులు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్ లో ఆమె అనుభవం గొప్ప నాయకత్వాన్ని అందించింది. నాయకత్వాన్ని అందించింది.
Also Read :- పాకిస్థాన్ బ్యాటర్ సంచలనం.. సెంచరీలతో కోహ్లీ, బట్లర్, గేల్ రికార్డ్ సమం
భారతదేశం అత్యంత ప్రతిభ ప్రదర్శించిన వెయిట్‌లిఫ్టర్‌లలో మీరాబాయి ఒకరు.. ఆమెతోపాటు కమీషన్ వైస్-ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత.వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు,పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు.