నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ నారీశక్తి జయహో.. 

నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ నారీశక్తి జయహో.. 

ఇండియాలో నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ ప్రాంతాలంటే ఆకుపచ్చని భూములు.. అందమైన మంచు పర్వతాలతో కూడిన చూడముచ్చటైన ప్రదేశాలు మాత్రమే కాదు.. ఆటల్లోనూ, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌లోనూ తాము అందరికంటే ముందేనని అక్కడి అమ్మాయిలు మరోసారి నిరూపించుకున్నారు. గత చరిత్రను కొనసాగిస్తూ.. మొన్న ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లోనూ మెడల్స్‌‌‌‌ సాధించి.. నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ నారీశక్తిని ఘనంగా చాటారు.

ఆసియా గేమ్స్‌‌‌‌.. కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌.. ఒలింపిక్స్‌‌‌‌.. ఇలా ఏ మెగా ఈవెంట్‌‌‌‌లోనైనా బాక్సింగ్‌‌‌‌, వెయిట్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌ను తీసుకుంటే.. ఇండియా ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ప్రాతినిధ్యంలో నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ ప్రాంతాల అథ్లెట్ల హవానే ఎక్కువ. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లోనూ అదే కంటిన్యూ అయ్యింది. నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ డాటర్స్‌‌‌‌ మీరాబాయ్‌‌‌‌ చానూ, లవ్లీనా బొర్గొహైన్‌‌‌‌.. తమ స్టన్నింగ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను సాధించారు. ఆటలపై ఈ ప్రాంతాలకు ఉండే స్ఫూర్తిని ఘనంగా చాటి చెప్పారు. మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీస్‌‌‌‌ నుంచి వచ్చిన ఈ ఇద్దరూ.. అంతర్జాతీయ యవనికపై భారత జెండాను సగర్వంగా రెపరెపలాడించడంతో ఇప్పుడు వాళ్ల విజయగాథలు, సాహసాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. వారి పోరాటాలు నిజమైనవేనని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
మణిపూర్​ మణిపూస చాను
మీరాబాయ్‌‌‌‌ చానూ.. మణిపూర్‌‌‌‌ నుంచి వచ్చిన ఓ యంగ్‌‌‌‌ వెయిట్‌‌‌‌లిఫ్టర్‌‌‌‌.. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో సరికొత్త సంచలనం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గేమ్స్‌‌‌‌ తొలి రోజే ఇండియాకు సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ అందించి హిస్టరీని క్రియేట్‌‌‌‌ చేసింది. ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియా తరఫున ఫస్ట్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించిన వెయిట్‌‌‌‌లిఫ్టర్‌‌‌‌గా రికార్డులకెక్కింది. పీవీ సింధు తర్వాత గేమ్స్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ నెగ్గిన రెండో అథ్లెట్‌‌‌‌గానూ చరిత్ర సృష్టించింది. విమెన్స్‌‌‌‌ 49 కేజీ కేటగిరీలో మొత్తం 202 కేజీల బరువు ఎత్తి ఈ ఘనతను సాధించింది. ఫలితంగా 21 ఏండ్ల తర్వాత మెగా గేమ్స్‌‌‌‌లో మెడల్‌‌‌‌ అందించిన సెకండ్‌‌‌‌ వెయిట్‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌గా నిలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌‌‌‌లో తెలుగుతేజం కరణం మల్లీశ్వరి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసింది. చానూ సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ స్థాయికి ఎదగడానికి చాలా కష్టాలు పడింది. వాటి వెనుక ఎన్నో కథలూ ఉన్నాయి.
నార్త్​ఈస్ట్​ నుంచి ఎందరో..
ఇక హిస్టరీని ఓసారి గుర్తు చేసుకుంటే.. ఆరుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఎంసీ మేరీకోమ్‌‌‌‌కు తప్పకుండా చోటు ఉంటుంది. 2012 లండన్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ డెబ్యూలోనే మేరీ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో సంచలనం సృష్టించింది. ఫలితంగా తమ ప్రాంత ప్రజలతో పాటు కంట్రీలో ఉండే యూత్‌‌‌‌ మొత్తానికి ఓ రోల్‌‌‌‌ మోడల్‌‌‌‌గా నిలిచింది. మేరీ లండన్‌‌‌‌లో మెడల్‌‌‌‌ గెలవడం ఇండియన్‌‌‌‌ అథ్లెట్లందరికీ ఓ స్ఫూర్తి అయితే, నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో ఓ రెవెల్యూషన్‌‌‌‌. త్రిపురకు చెందిన జిమ్నాస్ట్‌‌‌‌ దీపా కర్మాకర్‌‌‌‌.. 2016 రియో ఒలింపిక్స్‌‌‌‌కు క్వాలిఫై అయ్యింది. జిమ్నాస్టిక్స్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ వరకు వెళ్లి.. ఇండియా తరఫున ఎవరూ సాధించని ఘనతను అందుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌‌‌‌లో దీపా బ్రాంజ్‌‌‌‌తో మెరిసింది. ఇక సాకర్‌‌‌‌లో బైచూంగ్‌‌‌‌ భూటియా గురించి ఎంత చెప్పినా తక్కువే. యూరోపియన్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌కు దీటుగా తన ప్రతిభాపాటవాలను చూపెట్టిన మాంత్రికుడు. అయితే మేరీ మెడల్‌‌‌‌.. స్పోర్ట్స్‌‌‌‌ పట్ల ఆసక్తి ఉన్న నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ యూత్‌‌‌‌ పెద్ద కలలను కనడం, వాటిని సాకారం చేసుకునేందుకు ఓ మార్గాన్ని చూపెట్టింది. అస్సాంలోని నామ్చికి చెందిన ఆర్చర్‌‌‌‌ తరుణ్‌‌‌‌దీప్‌‌‌‌ రాయ్‌‌‌‌ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 2004లోనే ఒలింపిక్స్‌‌‌‌లో ఆడిన రాయ్‌‌‌‌కు.. ఆర్చరీలో విశేష అనుభవం ఉంది. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌, ఆసియా గేమ్స్‌‌‌‌లో ఎన్నో మెడల్స్‌‌‌‌ సాధించాడు. 
మిజోరామ్‌‌‌‌కు చెందిన లాల్‌‌‌‌రెమ్‌‌‌‌సియామి.. విమెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ స్టేట్‌‌‌‌ నుంచి హాకీ టీమ్‌‌‌‌లో ఆడిన తొలి ప్లేయర్‌‌‌‌గా ఆమె రికార్డులకెక్కింది. 18 ఏళ్ల వయసులో 2018లో వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో పాల్గొంది. ఆసియా కప్‌‌‌‌, ఆసియా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలోనూ బరిలోకి దిగింది. మొత్తానికి నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌కు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని  వారిలో ఉండే సహజ సిద్ధమైన ప్రతిభకు మెరుగులు దిద్దే సమయం ఆసన్నమైంది. కానోయింగ్‌‌‌‌, ఆర్చరీ, స్విమ్మింగ్‌‌‌‌, బాక్సింగ్‌‌‌‌, వెయిట్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌, అథ్లెటిక్స్‌‌‌‌, ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ వంటి క్రీడల్లో అద్భుతమైన ప్రతిభను చూపేవారు నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌లో ఉన్నారు. గ్రాస్‌‌‌‌ రూట్‌‌‌‌ లెవెల్లో వాళ్లను గుర్తించి సరైన శిక్షణ ఇస్తే ఫ్యూచర్‌‌‌‌లో ఒలింపిక్స్‌‌‌‌లాంటి మెగా ఈవెంట్లలో మరెన్నో పతకాలను ఆశించొచ్చు.. సాధించొచ్చు. 

ట్రక్‌‌‌‌ డ్రైవర్లకు సన్మానం..
మనలో కష్టపడే తత్వం ఉంటే సాయం చేసేవాళ్లు కూడా ముందుకొస్తారు. దీనికి చక్కని ఉదాహరణ చానూ జీవితం. నాంగ్‌‌‌‌పోక్‌‌‌‌ అనే చిన్న విలేజ్‌‌‌‌లో పుట్టిన చానూ.. ట్రెయినింగ్‌‌‌‌ కోసం  ఇంఫాల్‌‌‌‌ వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రతి రోజు 30 కిలోమీటర్లు ప్రైవేట్‌‌‌‌ బస్సులో ట్రావెల్‌‌‌‌ చేయడానికి డబ్బులు లేకపోవడంతో.. ఈ రూట్‌‌‌‌లో వెళ్లే సాండ్‌‌‌‌ ట్రక్‌‌‌‌ డ్రైవర్లను లిఫ్ట్‌‌‌‌ అడిగి వెళ్లేది. అలా తన మెడల్‌‌‌‌ జర్నీలో సాయంగా నిలిచిన 150 మంది డ్రైవర్లు, హెల్పర్లను మెడల్ గెలిచిన తర్వాత చానూ సత్కరించింది కూడా. అద్భుతమైన లంచ్‌‌‌‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి టీ షర్ట్స్‌‌‌‌, మణిపూర్‌‌‌‌ స్కార్ఫ్‌‌‌‌ను బహుమతిగా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన ఆమె కన్నీళ్లపర్యంతమైంది. తాను మూలాలు మర్చిపోలేదనే దానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్‌‌‌‌ చాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరు చానూకు అభినందనలు కూడా తెలియజేశారు. మెడల్‌‌‌‌తోనే కాకుండా తన వినయ విధేయలతోనూ చానూ.. ప్రపంచ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.                                                           - ఆర్ధ శ్రీనివాస్​ పటేల్, మీడియా & కమ్యూనికేషన్​ ప్రొఫెషనల్