న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను వచ్చేనెల 6 నుంచి బహ్రెయిన్‌లోని మనామాలో జరిగే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీ పడటం లేదు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో మీరా ఈ టోర్నీలో పాల్గొనడం లేదని నేషనల్ చీఫ్ కోచ్ విజయ్ వర్మ తెలిపారు.
గతేడాది ఆసియా గేమ్స్‌లో తుంటి గాయానికి గురైన చాను ఫిట్‌నెస్‌పై అనుమానాలతోనే పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి నాలుగో స్థానంతో సరిపెట్టింది. కాగా, చాను గైర్హాజరీలో జ్ఞానేశ్వరి యాదవ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఇండియాను ముందుండి నడిపించనుంది. తను 49 కేజీ విభాగంలో పోటీ పడనుండగా.. బింద్యారాణి దేవి 55 కేజీల్లో, దితిమోని సోనోవాల్ 64 కేజీల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.